వృద్ధాప్యంలో ఉన్న అత్తను కోడలే చూసుకోవాలి.. అది మన సంస్కృతిలోనే ఉంది: ఝార్ఖండ్ హైకోర్టు
- విడాకుల కేసులో హైకోర్టు కీలక తీర్పు
- వృద్ధులైన అత్తమామల నుంచి విడిపోవాలని ఒత్తిడి తేవడం సరికాదని వ్యాఖ్య
- ఎలాంటి కారణం లేకుండా భర్త నుంచి విడిపోతే మనోవర్తి పొందే హక్కు ఉండదన్న న్యాయస్థానం
విడాకుల కేసును విచారించిన దుమ్కాలోని కుటుంబ న్యాయస్థానం భార్యకు రూ.30 వేలు, కుమారుడికి రూ. 15 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది. భర్త దీనిని ఝార్ఖండ్ హైకోర్టులో సవాలు చేశాడు. దీనిని విచారించిన న్యాయస్థానం పై విధంగా తీర్పు చెప్పింది. అంతేకాదు, ఈ సందర్భంగా కుటుంబంలోని మహిళ ప్రాముఖ్యాన్ని చెబుతూ మనుస్మృతిలోని విషయాలను ప్రస్తావించడం గమనార్హం.