రూమర్లకు మరింత బలం.. శుభ్ మన్ గిల్ చెల్లెలితో కనిపించిన సారా టెండూల్కర్
- శుభ్ మన్ గిల్, సారా టెండూల్కర్ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం
- ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు
- ఈ వార్తలపై ఇంత వరకు ఎవరూ స్పందించని వైనం
ముంబైలో గిల్ చెల్లెలు షహ్ నీల్ గిల్ తో కలిసి సారా టెండూల్కర్ కెమెరాల కంటికి చిక్కారు. ఒకే కారులో ఇద్దరూ ఉండగా కొందరు వీడియోలు తీశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఇండియాలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఆడిన అన్ని మ్యాచ్ లకు సారా టెండూల్కర్ హాజరయింది. గిల్ సెంచరీ కొట్టిన ప్రతిసారి ఆమె లేచి నిలబడి, చప్పట్లు కొడుతూ సందడి చేసింది. గిల్ ప్రేమలో సారా ఉంది కాబట్టే ఆమె అంత సంతోషానికి గురవుతోందని ఎంతో మంది వ్యాఖ్యానించారు. ఇప్పుడు గిల్ సోదరితో ఆమె కనిపించడంతో ప్రేమ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది.