ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో నా కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి: పవన్ కల్యాణ్
- బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్
- తాను భావోద్వేగానికి గురయ్యానన్న జనసేనాని
- రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింతగా పెంచిందని వ్యాఖ్య
అయోధ్య రామమందిర తీర్థ ట్రస్ట్ దేశంలోని పలువురు ప్రముఖులకు ఈ కార్యక్రమం కోసం ఆహ్వానం పంపించింది. ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు కార్యక్రమానికి హాజరయ్యారు. రామమందిరం ఎదుట జనసేనాని ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈ ఫొటోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.