విమానయాన సంస్థ ‘ఇండిగో’కి రూ.1.2 కోట్ల జరిమానా
- ప్రయాణికులకు రన్‌వేపై భోజనం ఏర్పాటు చేయడంపై బీసీఏఎస్ సీరియస్
- ముంబై ఎయిర్‌పోర్టుకి రూ.30 లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
- వైరల్ వీడియోపై సీరియస్ అయిన నియంత్రణ సంస్థలు
ఈ సందర్భంగా ప్రయాణికులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయితే విమానం పక్కనే రన్‌వేపై కూర్చొని ప్రయాణికులు భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కూడా తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే ముంబై ఎయిర్‌పోర్టుకి రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఈ వీడియోపై ఇండిగో, ముంబై విమానాశ్రయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.