ఉండవల్లిలో ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం
- ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్
- మూడున్నర గంటల పాటు సమావేశం
- ఎన్నికలే ప్రధాన అజెండగా భేటీ
- 12 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఖరారు
- ఈ నెలలో మేనిఫెస్టో ప్రకటన
కాగా, ఈ సమావేశంలో ఎన్నికలే ప్రధాన అజెండాగా చర్చలు సాగాయి. 12 అంశాలతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.
టీడీపీ ఇప్పటికే 'సూపర్ సిక్స్' పేరుతో మేనిఫెస్టో అంశాలను ప్రకటించగా, ఇప్పుడు వాటికి జనసేన 'షణ్ముఖ వ్యూహం' మరో ఆరు అంశాలను జోడించింది. ఈ నెలలోనే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. పొత్తులో అత్యంత కీలకమైన సీట్ల సర్దుబాటు విషయం కూడా చర్చించారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.