బీజేపీ నేతలు కేసీఆర్ ను కాపాడాలనుకుంటున్నారా?: జీవన్ రెడ్డి

Jeevan Reddy slams BRS and BJP
  • కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటూ కాంగ్రెస్ ఆరోపణలు
  • న్యాయ విచారణను బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందన్న జీవన్ రెడ్డి
  • బీజేపీ నేతల మాటల్లో కేసీఆర్ ను కాపాడాలన్న తాపత్రయం కనిపిస్తోందని వెల్లడి
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణను అడ్డుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ తన మిత్రపక్షమైన బీజేపీని కోరిందని... బీజేపీ నేతల మాటలు చూస్తుంటే కేసీఆర్ ను కాపాడాలన్న తాపత్రయం కనిపిస్తోందని జీవన్ రెడ్డి విమర్శించారు. 

హైదరాబాదులోని గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పారదర్శకత కోసమే తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని స్పష్టం చేశారు. అవసరమైతే సీబీఐ సాయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. కానీ బీఆర్ఎస్ పార్టీ న్యాయ విచారణకు అడ్డు తగిలే ప్రయత్నాలు చేస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు.
Advertisement
Jeevan Reddy
Congress
Kaleswaram
BRS
BJP
Telangana

More Telugu News