త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తా.. కేశినేని నాని సంచలన ప్రకటన
- త్వరలోనే లోక్‌సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటన
- తాను పార్టీకి అవసరం లేదని చంద్రబాబు భావించాక కొనసాగడం సబబుకాదన్న నాని
- ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేసిన విజయవాడ ఎంపీ
ఇదిలావుంచితే కేశినేని నాని శుక్రవారం ఉదయం రాజకీయపరంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని, ఈ మేరకు టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకళ్ళ నారాయణ గురువారం సాయంత్రం వచ్చి తనకు చెప్పారని అన్నారు. తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభా నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు, తనను జోక్యం చేసుకోవద్దని చెప్పారని ప్రకటించిన విషయం తెలిసిందే.