ఎగిరెగిరి పడుతున్న వాళ్లను ఎలా అణచివేయాలో నాకు తెలుసు: చంద్రబాబు
- కుప్పంలో రెండో రోజు కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన
- ఈ సాయంత్రం జనసేన శ్రేణులతో భేటీ కానున్న చంద్రబాబు
- వైసీపీ ప్రభుత్వానికి వంద రోజులు మాత్రమే మిగిలుందన్న టీడీపీ అధినేత
మరోవైపు తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వానికి మిగిలింది వంద రోజులు మాత్రమేనని చెప్పారు. వైసీపీలో ఎగిరెగిరి పడుతున్న వాళ్లను ఎలా అణచివేయాలో తనకు తెలుసని చెప్పారు. యువతలో ప్రతి ఇంటి నుంచి ఒకరు రోడ్డు మీదకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక్క ఛాన్స్ అని అడిగితే, ప్రజలు ఓటేస్తే... రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని జగన్ పై మండిపడ్డారు.