కొండముచ్చుకు వినతిపత్రం అందజేసిన ఏపీ అంగన్వాడీలు... వీడియో ఇదిగో!
- డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న ఏపీ అంగన్వాడీలు
- గత రెండు వారాలుగా సమ్మె
- ఆసక్తికర వీడియో పంచుకున్న తెలుగుదేశం పార్టీ
సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మె కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓ కొండముచ్చుకు వినతిపత్రం అందించారు. ఓ అంగన్వాడీ నేత ఇచ్చిన వినతిపత్రాన్ని ఆ కొండముచ్చు అందుకోవడంతో అందరూ చప్పట్లు కొట్టారు.
దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. జగన్ ఎలాగూ పట్టించుకోవడంలేదని, అంగన్వాడీలు కొండముచ్చుకు వినతిపత్రం అందజేశారని పేర్కొంది.