ఓటీటీ సెంటర్ కి వస్తున్న 'హాయ్ నాన్న'

Hi Nanna movie update
  • నాని నుంచి ఇటీవలే వచ్చిన 'హాయ్ నాన్న'
  • స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ 
  • వచ్చేనెలలో ఓటీటీ తెరపైకి రానున్న సినిమా
  • దర్శకుడిగా పరిచయమైన 'హాయ్ నాన్న'

నాని తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలామంది కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ వెళుతున్నాడు. అలాగే ఆయన తన సినిమాల్లో ఎమోషన్స్ కూడా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడానికి అవసరమైన ఆయుధమే ఎమోషన్ అని ఆయన నమ్ముతూ ఉంటాడు. 

అలా ఆయన నుంచి ఇటీవల వచ్చిన సినిమానే 'హాయ్ నాన్న'. ఈ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ పరిచయమయ్యాడు. మృణాల్ ఠాకూర్.. బేబీ కియారా ఖన్నా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, ఒక పాటలో శ్రుతిహాసన్ మెరిసింది. కంటెంట్ పరంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. 

నాని కెరియర్లో ఇది మరో హిట్ మూవీగా నిలిచింది. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు. ఈ సినిమాను జనవరి 19వ తేదీనగానీ .. 26వ తేదీన గాని స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుందా అని వెయిట్ చేస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. 
Advertisement
Hi Nanna
Nani
Mrunal Thakur

More Telugu News