సూర్యాపేట జిల్లాలో 2 వేల మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy on double bed room houses
  • పొంగులేటితో కలిసి సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • 1౦౦ ఎకరాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • అర్హులకు మోడల్ కాలనీలో ఇళ్లు కేటాయిస్తామని వెల్లడి
సూర్యాపేట జిల్లాలో రెండువేల మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 100 ఎకరాల స్థలంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించి... పేదలకు కేటాయిస్తామని తెలిపారు. మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామన్నారు. అర్హులకు మోడల్ కాలనీలో ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు. 'పదేళ్లలో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కట్టింది 270 ఇళ్లు మాత్రమే. చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు పనిచేయడం లేదు.. 100 రోజులలో అన్నీ పూర్తి చేసి చూపిస్తామని' మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Go Back to Shorts
Uttam Kumar Reddy
Telangana
Congress

More Telugu News