వాళ్లిద్దరిని చూస్తే జగన్ కు భయం: నారా లోకేశ్
- పోలిపల్లిలో యువగళం నవశకం సభ
- హాజరైన నారా లోకేశ్
- జగన్ కు ఉక్కపోత మొదలైంది అంటూ వ్యాఖ్యలు
"విజనరీ అంటే చంద్రబాబు... ప్రిజనరీ అంటే జగన్... ఇది ఫిక్స్. జగన్ అరెస్ట్ అయితే రోజుకో స్కామ్ బయటపడింది... చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే 15 ఏళ్లు సీఎంగా ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం బయటకు వచ్చింది. 53 రోజులు నిజాన్ని బంధించారు. కానీ ఆఖరికి నిజమే గెలిచింది. పవనన్న ఏపీకి వస్తుంటే అడ్డుకుంటారు ఈ వైసీపీ పిరికి సన్నాసులు. ఆయన రావాలి అనుకున్న ఫ్లయిట్ క్యాన్సిల్ చేస్తారు. పవనన్నని ఏపీ బోర్డర్ లో ఆపేస్తారు. ప్రజాస్వామ్యాన్ని నువ్వు దెబ్బ తీశావ్ జగన్... ప్రజాస్వామ్యం తిరగబడి దెబ్బకొడితే ఎలా ఉంటుందో నువ్వు త్వరలోనే చూస్తావ్" అంటూ లోకేశ్ హెచ్చరించారు.
జరగబోయేది జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం.... జగన్ అహంకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి పాతిపెడతాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజనరీ చంద్రబాబు గారు రాష్ట్రానికి కావాలి... ప్రజలకు మంచి చెయ్యాలి అనుకునే పవర్ ఫుల్ నాయకుడు పవనన్న రాష్ట్రానికి కావాలి అని లోకేశ్ పిలుపునిచ్చారు.
ప్రతి అడుగులో జగన్ విధ్వంసం చూశా
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనం తెచ్చిన ఎలక్ట్రానిక్స్, ఐటి కంపెనీలు కనిపించాయి... పాపాల పెద్దిరెడ్డి పది వేలకోట్ల అవినీతి సామ్రాజ్యం కనిపించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రన్న తెచ్చిన కియా, డ్రిప్ ఇరిగేషన్ కనపడింది... జగన్ తెచ్చిన కష్టాలు కనపడ్డాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తెచ్చిన విమానాశ్రయం, మెగా సీడ్ పార్క్, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించాయి... జగన్ మిగిల్చిన కన్నీరు కనిపించింది.