పోలిపల్లిలో ప్రారంభమైన యువగళం నవశకం సభ... భారీగా తరలివచ్చిన టీడీపీ-జనసేన శ్రేణులు
- ముగిసిన లోకేశ్ యువగళం
- పోలిపల్లిలో భారీ బహిరంగ సభ
- హాజరవుతున్న చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ
ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణ హాజరు కానున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. పొత్తు నేపథ్యంలో, నేటి యువగళం సభ ద్వారా ఇరు పార్టీల అధినేతలు ఉమ్మడిగా పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.