సోనియాగాంధీని కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy meets Sonia Gandhi
  • రాహుల్ గాంధీని కూడా కలిసిన తెలంగాణ మంత్రి
  • మర్యాదపూర్వకంగానే వారిని కలిసినట్లు తెలిపిన ఉత్తమ్  
  • ఉత్తమ్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన మీడియా ప్రతినిధులు
కాంగ్రెస్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిశారు. సోనియాతో సమావేశంపై ఆయన స్పందిస్తూ... ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని, మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. సోనియాను కలిసిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ, సోనియాతో పాటు రాహుల్ గాంధీని కూడా మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. 

ఈ భేటీలో రాహుల్ గాంధీ ఏమన్నారు? ఈ రోజు మీరు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన మాత్రం సరైన సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీకర్ ఓంబిర్లాను కలిసి, తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Go Back to Shorts
Sonia Gandhi
Uttam Kumar Reddy
Congress

More Telugu News