టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ... తదుపరి పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి
- సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఉన్నతాధికారులు
- ప్రస్తుత స్థితి, పరీక్షల నిర్వహణ, తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
గ్రూప్ 1, ఏఈఈ తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో పురోగతి, ఇప్పటి వరకు జరిగిన విచారణ, తదుపరి కార్యాచరణపై చర్చించారు. అదే సమయంలో ఇతర పరీక్షల తేదీలు, నిర్వహణ అంశంపై చర్చించారు. లీకేజీతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారని, కాబట్టి అన్ని అంశాలను పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.