మాజీ మంత్రి నారాయణ ముందస్తు, క్వాష్ పిటిషన్‌లపై విచారణ వాయిదా
- అసైన్డ్ భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో నారాయణపై కేసు
- తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు
- బండారు సత్యనారాయణ భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ వాయిదా
మరోవైపు తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. అరెస్ట్ సమయంలో తీసిన ఫోటోలను పోలీసులు న్యాయస్థానానికి అందించారు. అంతకుముందే పిటిషనర్ తరఫు న్యాయవాది.. సీసీ ఫుటేజీని కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై నాలుగు వారాల తర్వాత విచారిస్తామని హైకోర్టు తెలిపింది.