Revanth Reddy: సచివాలయానికి బయలుదేరిన కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy to reach secretariate
షార్ట్స్‌లో చూడండి
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలుదేరారు. ఎల్బీ స్టేడియంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ఆరు గ్యారెంటీలపై సంతకం చేశారు. రెండో సంతకం దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రంపై చేశారు. అనంతరం సచివాలయానికి బయలుదేరారు. సచివాలయంలో ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సీఎంగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana Assembly Results
Congress

More Telugu News