హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కే... ముంబయి ఇండియన్స్ కు నిరాశ!
- గతంలో ఏడు సీజన్ల పాటు ముంబయి ఇండియన్స్ కు ఆడిన పాండ్యా
- గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వైనం
- పాండ్యా కోసం రూ.15 కోట్లు చెల్లించేందుకు ముంబయి సిద్ధపడినట్టు వార్తలు
- పాండ్యాను అట్టిపెట్టుకోవడం ద్వారా ప్రచారానికి తెరదించిన టైటాన్స్
ఈ నేపథ్యంలో, హార్దిక్ పాండ్యాను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేయనుందంటూ ప్రచారం జరిగింది. పాండ్యాను రిలీజ్ చేసేందుకు గుజరాత్ ఫ్రాంచైజీకి ఏకంగా రూ.15 కోట్లు చెల్లించేందుకు ముంబయి ఇండియన్స్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, గుజరాత్ టైటాన్స్ వాటిన్నింటికీ తెరదించింది. హార్దిక్ పాండ్యాను ఈ సీజన్ కు కూడా అట్టిపెట్టుకుంటున్నట్టు ప్రకటించింది. అతడే తమ నాయకుడు అని స్పష్టం చేసింది.