ఆదిలాబాద్ సభా వేదికపైకి వచ్చిన అమ్మాయి... కాంగ్రెస్ గ్యారెంటీలు ఆమెతో చదివించిన రాహుల్ గాంధీ
- అమ్మాయి వేదిక పైకి రాగానే హిందీలో చెప్పగలవా? అని అడిగిన రాహుల్ గాంధీ
- చెప్పగలనని అనడంతో ఆరు గ్యారెంటీలు చదివి చెప్పాలని సూచన
- మహిళల కోసం కాంగ్రెస్ తీసుకొస్తున్న పథకాలను అమ్మాయితో చెప్పించిన రాహుల్ గాంధీ..
ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడారు. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కేవలం గ్యారెంటీ మాత్రమే కాదని, కాంగ్రెస్ గెలిచాక వీటిని చట్టాలలా చేస్తామని చెప్పారు. ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్ సమావేశంలోనే వీటిని చట్టాలుగా మారుస్తామన్నారు.