Kadiam Srihari: రేవంత్ రెడ్డీ... ప్రజలకు ఇందిర ఆస్తులు రాసిస్తే మరుక్షణమే నేనూ రాసిస్తా: కడియం శ్రీహరి సవాల్

Kadiyam Srihari challenges Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
స్టేషన్ ఘనపూర్‌లో తనపై విమర్శలు గుప్పించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాఫర్‌గడ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో కడియం మాట్లాడుతూ... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర చిత్తుచిత్తుగా ఓడిపోయిందని గుర్తుచేశారు. ఇందిర నియోజకవర్గంపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతోందని అన్నారు. కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నట్లు చెప్పారు. కానీ ఈ నియోజకర్గంలో ఇందిర ఒక్కరికి కూడా సాయం అందించలేదన్నారు.

తనపై ఎలాంటి కేసులు లేవని, కానీ రేవంత్ రెడ్డి, ఇందిరలపై ఉన్నాయన్నారు. ఇందిరపై ఇక్కడ చీటింగ్ కేసు నమోదు అయిందని, ఆ కేసు సుప్రీంకోర్టులో ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రజలకే అందుబాటులో ఉండని ఇందిరకు ఇక్కడి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రజలు, మాదిగలపై ఇందిరకు ప్రేమ ఉంటే ఆమె ఆస్తులు రాసివ్వాలని సవాల్ చేశారు. ఆమె తన ఆస్తులను రాసిస్తే మరుక్షణమే తానూ రాసిస్తానన్నారు. రేవంత్ రెడ్డి ఓ గజదొంగ అన్నారు.
Go Back to Shorts
Kadiam Srihari
rajaiah
Telangana Assembly Election
BRS

More Telugu News