టీమిండియా ఆటగాళ్ల దీపావళి వేడుకలు.. ఫొటోలు ఇవిగో!
- భార్య అనుష్కతో కలిసి పాల్గొన్న కోహ్లీ
- వేడుకలకు ఫ్యామిలీతో హాజరైన కెప్టెన్ రోహిత్
- సంప్రదాయ దుస్తులలో సందడి చేసిన క్రికెటర్లు
లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్ తో భారత జట్టు తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. దీంతో భారత జట్టు సభ్యులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. శనివారం దీపావళి వేడుకలను హోటల్ లోనే ఘనంగా జరుపుకున్నారు. జట్టులోని ప్లేయర్లతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర టీంమెంబర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

