4 ఏళ్ల బాలికపై ఎస్సై అత్యాచారం!
- రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో శుక్రవారం ఘటన
- నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్న ఏఎస్పీ
- ఘటనకు రాజస్థాన్ ప్రభుత్వానిదే బాధ్యతన్న బీజేపీ ఎంపీ కిరోడీ లాల్ మీనా
మరోవైపు, స్థానికులు ఘటనపై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. స్థానిక రాహువాస్ పోలీస్ స్టేషన్‌ను ఘెరావ్ చేసి నిందితుడికి దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించారు. ఘటనపై స్పందించిన భారతీయ జనతా పార్టీ ఎంపీ కిరోడీ లాల్ మీనా స్పందించారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం చేతకానితనం చూసి పేట్రేగిపోతున్న పోలీసులు ఎన్నికల సమయంలోనూ దారుణాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.