ఇసుక కేసు.. పాస్ ఓవర్ అడిగిన చంద్రబాబు న్యాయవాదులు

AP High Court hearing on Chandrababu bail plea in sand case
  • ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 1,300 కోట్ల నష్టం జరిగిందన్న సీఐడీ
  • ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని ఎఫ్ఐఆర్
  • ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు
ఇసుక కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది. ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చింది. 

ఈ నేపథ్యంలో, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు వాదనలకు కొంత సమయాన్ని (పాస్ ఓవర్) కోరారు. దీంతో, మధ్యాహ్నం పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. మరోవైపు, విధానపరమైన నిర్ణయాలకు నేరాలను ఆపాదిస్తున్నారని పిటిషన్ లో చంద్రబాబు పేర్కొన్నారు. 17ఏ ప్రకారం కేసు నమోదుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Sand
AP High Court

More Telugu News