బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీతో పాటు పవన్ కల్యాణ్ హాజరు
- బీజేపీ - జనసేన మధ్య కుదిరిన పొత్తు.. జనసేనకు 8 సీట్లు
- శేరిలింగంపల్లి సీటు కోసం జనసేన పట్టు
- మోదీ సభ అనంతరం పొత్తులు, సీట్లపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మగౌరవ సభ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బషీర్ బాగ్ నుంచి, ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి, గన్ ఫౌండ్రి నుంచి వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎన్నికల షెడ్యూల్ అనంతరం ప్రధాని మోదీ సభ ఇదే మొదటిది. గత సభలలో కేంద్రమంత్రి అమిత్ షా బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. ఈ సభలో నరేంద్రమోదీ నోటి నుంచి కూడా ఆ ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. బీసీ ఆత్మగౌరవ సభకు లక్ష మంది వరకు ప్రజలు వస్తారని అంచనా.