సుప్రీంకోర్టులో ఏపీలో దొంగ ఓట్ల కేసు.. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
- పిటిషన్ వేసిన నిమ్మగడ్డ రమేశ్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ
- తాను గతంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేశానన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్
- అందుకే విచారణ నుంచి తప్పుకుంటున్నానని వెల్లడి
మరోవైపు, ఏపీలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయంటూ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, కేసు నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలిపారు. దీంతో, చీఫ్ జస్టిస్ ఆదేశాలతో మరో ధర్మాసనం ముందు ఈ పిటిషన్ ను లిస్ట్ చేయాలంటూ రిజిస్ట్రీకి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు.