డీకే శివకుమార్ కంటే ఎక్కువ మెజార్టీ రావాలి: రేవంత్ రెడ్డి
- కొడంగల్ లో నామినేషన్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి
- ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినా అభివృద్ధి చేయలేదని విమర్శ
- రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని వ్యాఖ్య
తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చింది తన కోసం కాదని... మీ కోసమేనని అన్నారు. కొడంగల్ యువతకు ఉద్యోగాలను అందించేందుకు జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలు అని చెప్పారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని... ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని అన్నారు. ఈరోజు నామినేషన్ వేశానని... తెలంగాణ గెలవబోతోందని... అది కొడంగల్ నుంచే ఆరంభమవుతుందని చెప్పారు.