‘అత్తారింటికి దారేది’ సినిమాలో అందుకే నటించలేదు.. కారణం వెల్లడించిన అనసూయ
- గుంపులో ఒకరిగా నటించడం ఇష్టం లేకే ఆ సినిమాను వదులుకున్నానన్న అనసూయ
- పార్టీలకు వెళ్లకపోవడం వల్లే హీరోయిన్ అయ్యే చాన్స్ కోల్పోయానని ఆవేదన
- తన భర్త తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడన్న నటి
అప్పట్లో ఆ అవకాశాన్ని వదులుకున్నందుకు చాలామంది తనను విమర్శించారని గుర్తు చేసుకున్నారు. తాను నో చెప్పడం తప్పు కాదు కానీ, ఆ విధానం తప్పని తనకు తర్వాత అనిపించిందని, అందుకనే త్రివిక్రమ్‌కు సారీ చెప్పానని వివరించారు. తాను ముక్కుసూటి మనిషినని, షూటింగ్స్‌లో తన పనేదో తాను చూసుకుని వెళ్తుంటానని చెప్పారు. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు దూరంగా ఉండబట్టే హీరోయిన్ అవకాశాలు చేజారాయని తెలిపారు. పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయనుకుంటే, అటువంటి వాటిని తాను ప్రోత్సహించనని తేల్చి చెప్పారు.
ఇప్పుడు తనలో మార్పు వచ్చిందని, ఎలాంటి పాత్రలోనైనా గుర్తింపు తెచ్చుకోగలననే నమ్మకం కలిగిందని అనసూయ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారి ఇళ్లలోని మహిళలను తలచుకుంటే తనకు జాలివేస్తుందని, ఈ విషయంలో తన భర్త తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తన నుంచి స్ఫూర్తి పొందేవాళ్లు చాలామందే ఉన్నారని అనసూయ పేర్కొన్నారు.