వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి
- ఇటలీలో సందడిగా జరిగిన పెళ్లి వేడుకలు
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ
- నవంబర్ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్
కాగా.. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత వరుణ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు. అభిరుచులు కలవడంతో స్నేహం ప్రేమగా మారిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తమ ప్రేమకథను పంచుకున్న విషయం తెలిసిందే. 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలో కూడా కలిసి నటించడంతో స్నేహం కాస్త ఇష్టంగా మారింది. ఇక సినిమా పరిశ్రమ, సెలబ్రిటీల కోసం నవంబర్ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేసుకున్నారు. మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ వేదికగా ఈ వేడుక జరగనుంది.