హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు.. అభిమానుల ఘనస్వాగతం
- గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న టీడీపీ అధినేత
- విమానాశ్రయానికి భారీగా తరలివచ్చిన అభిమానులు
- చంద్రబాబు అనుకూల నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిన వైనం
- మీడియాతో మాట్లాడకుండా తన నివాసానికి బయలుదేరిన టీడీపీ అధినేత
- రేపు ఏఐజీ ఆసుపత్రిలో బాబుకు వైద్య పరీక్షలు
షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో చంద్రబాబు కారులోంచే తనను చూసేందుకు వచ్చిన వారికి అభివాదం చేశారు. మీడియాతో మాట్లాడకుండానే ఆయన వెళ్లిపోయారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు వేలాది మంది ఆయన కారును అనుసరించారు. ఈ సందర్భంగా అనేక మంది బేగంపేట, జూబ్లీహిల్స్ రహదారులకు ఇరువైపులా నిలబడి చంద్రబాబుకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఉదయం నగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.