సంబరాలతో హోరెత్తిస్తున్న టీడీపీ శ్రేణులు.. ట్రెండ్ అవుతున్న ‘నిజం గెలిచింది’ హ్యాష్‌ట్యాగ్
- బాణసంచా కాలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ టీడీపీ శ్రేణుల సంబరాలు
- వైరల్ అవుతున్న వీడియోలు
- వచ్చే నెల 28 వరకు చంద్రబాబుకు బెయిలు మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
చంద్రబాబునాయుడు ఆరోగ్య కారణాల నేపథ్యంలో పెట్టుకున్న పిటిషన్‌కు ఆమోదం తెలిపిన న్యాయస్థానం ఆయనకు నాలుగు వారాల బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 28వ తేదీ వరకు ఆయన బెయిలుపై వుంటారు. ఆరోజు సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. కాగా, ప్రధాన బెయిలు పిటిషన్ వచ్చే నెల 10న విచారణకు రానుంది.