ఈ దసరాకు జగనాసుర దహనం చేద్దాం: నారా లోకేశ్
- ‘సైకో పోవాలి’ అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని పిలుపు
- విజయ దశమి సందర్భంగా సోమవారం రాత్రి 7 గంటలకు నిరసన కార్యక్రమం
- చెడుపై చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరా సెలబ్రేట్ చేసుకోవాలన్న లోకేశ్
దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దాం. అక్టోబర్ 23 విజయదశమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్యలో వీధుల్లోకి వచ్చి ``సైకో పోవాలి`` అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయండి. ఆ వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని నారా లోకేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.