ఈ నెల 23న రాజమండ్రిలో నారా లోకేశ్, పవన్ కల్యాణ్ అధ్యక్షతన కీలక సమావేశం
- ఏపీలో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన
- ఎన్నికల కోసం కలిసి నడవాలని నిర్ణయం
- పొత్తు సమన్వయం కోసం ఇప్పటికే జేఏసీ సభ్యులను ప్రకటించిన ఇరు పార్టీలు
లోకేశ్, పవన్ కల్యాణ్ అధ్యక్షతన టీడీపీ-జనసేన జేఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల దిశగా ఉమ్మడి కార్యాచరణ, ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదర్చడం తదితర అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ కార్యక్రమాల జోరు పెంచేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేయడంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
కాగా, పొత్తు సమన్వయం కోసం టీడీపీ, జనసేన ఇప్పటికే జేఏసీ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే.