కేసీఆర్ నుంచి బీఫామ్ అందుకున్న కడియం శ్రీహరి

కేసీఆర్ నుంచి బీఫామ్ అందుకున్న కడియం శ్రీహరి

Kadiam Srihari receives B form from KCR
  • స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను కడియం శ్రీహరికి ఇచ్చిన కేసీఆర్
  • ప్రగతి భవన్ కు వెళ్లి బీఫామ్ అందుకున్న శ్రీహరి
  • రాజయ్యను రైతుబంధు సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మాజీ మంత్రి కడియం శ్రీహరి బీఫామ్ అందుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బదులుగా కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను కేసీఆర్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రగతి భవన్ కు వెళ్లిన శ్రీహరి బీఫామ్ ను తీసుకున్నారు. మరోవైపు, కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు తెలుపుతున్నానని రాజయ్య తెలిపారు. శ్రీహరి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. స్టేషన్ ఘన్ పూర్ లో గులాబీ జెండా ఎగుర వేస్తామని కేటీఆర్ కు ఆయన మాట కూడా ఇచ్చారు. మరోవైపు రాజయ్యకు టికెట్ ఇవ్వని నేపథ్యంలో... ఆయనను రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు.
Advertisement
Kadiam Srihari
KCR
brs

More Telugu News