చంద్రబాబును చూడగానే బాధ కలిగింది... మాట్లాడలేకపోతున్నారు: కాసాని
- భువనేశ్వరి, లోకేశ్‌తో పాటు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని ములాఖత్
- చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న కాసాని
- తెలంగాణలో టీడీపీ పోటీకి సంబంధించి సూచనలు తీసుకున్న కాసాని
ములాఖత్ అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఆయన మాట్లాడలేకపోతున్నట్లు చెప్పారు. జైల్లో ఆయన పరిస్థితి చూడగానే బాధ కలిగిందన్నారు.
కాగా, తెలంగాణలో టీడీపీ పోటీకి సంబంధించి అధినేత నుంచి కాసాని పలు సూచనలు తీసుకున్నట్టు తెలుస్తోంది.