యూత్ ను హుషారెత్తిస్తున్న హాట్ బ్యూటీ .. నేహా శెట్టి: లేటెస్ట్ పిక్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూత్ ను హుషారెత్తిస్తున్న హాట్ బ్యూటీ .. నేహా శెట్టి: లేటెస్ట్ పిక్స్!

Neha Shettty Special
  • నాజూకు భామగా మెరుస్తున్న నేహా శెట్టి
  • యూత్ హృదయాలను కొల్లగొడుతున్న బ్యూటీ
  • సోషల్ మీడియాలోను అందాల సందడి 
  • ఆమె నుంచి త్వరలో రానున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'

మొదటి నుంచి కూడా నేహా శెట్టి హాట్ బ్యూటీగానే యూత్ నుంచి మార్కులు కొట్టేస్తూ వస్తోంది. పూరి జగన్నాథ్ ఒక హీరోయిన్ ను పరిచయం చేస్తున్నాడంటే ఆ హీరోయిన్ లో ఏదో ప్రత్యేకత ఉందని 'మెహబూబా' సినిమాతోనే యూత్ భావించింది. ఆ విషయంలో వాళ్లను ఎంత మాత్రం నిరాశపరచకుండా నేహా శెట్టి ముందుకు వెళుతోంది. తెల్లని మేనిఛాయతో .. నాజూకుదనంతో .. హాట్ లుక్స్ తో తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసులను రాజేసిన .. కాజేసిన బ్యూటీగా ఆమె పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి ఆ ఇమేజ్ ను నిలబెట్టుకుంటూ వెళుతోంది. 'డీజే టిల్లు' సినిమాలో పోషించిన 'రాధిక' పాత్ర ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఆ పాత్రకి ఆమె ఇచ్చిన గ్లామర్ టచ్ ను యూత్ అలా గుర్తుపెట్టేసుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన 'బెదురులంక 2012' .. 'రూల్స్ రంజన్' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, గ్లామర్ పరంగా నేహా శెట్టి తన జోరును చూపించింది. త్వరలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. ఇక మరో వైపున లేటెస్ట్ ఫొటో షూట్ లతోను బిజీగానే ఉంది. అలా ఆమె నుంచి వచ్చిన పిక్స్ తోనే కుర్రాళ్ల కళ్లు ఇప్పుడు కాలక్షేపం చేస్తున్నాయి.
Advertisement
Neha Shetty
Actress
Gangs of Godavari

More Telugu News