తెలంగాణ సచివాలయంలో గంగవ్వ.. ఎంత పెద్ద బిల్డింగో అంటూ ఆశ్చర్యం.. వీడియో ఇదిగో!
- జీవితంలో మొదటిసారి ఇంత పెద్ద ఇల్లు చూస్తున్నానని వ్యాఖ్య
- రాజభవనంలా కట్టారంటూ కితాబునిచ్చిన యూట్యూబర్
- అనిల్ తో కలిసి అమరవీరుల స్థూపం సందర్శన
సచివాలయంలోకి పోనివ్వరని అన్నావు కదా అనీల్.. గంగవ్వ అంటే ఏమనుకున్నావు, నన్ను చూసి లోపలికి అనుమతించారు చూశావా? అంటూ అనిల్ తో చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ సచివాలయంలో గంగవ్వ కలియ తిరుగుతున్న ఈ వీడియోను బీఆర్ఎస్ నేతలు షేర్ చేస్తూ.. తెలంగాణ అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తూ ఆశ్చర్యపోతున్న గంగవ్వ అంటూ కామెంట్లు పెడుతున్నారు.