తెలంగాణలో ఎన్నికల కోడ్...హైదరాబాద్‌లో భారీగా బంగారం, వెండి పట్టివేత
- తెలంగాణలో అమల్లోకి ఎన్నికల నియమావళి
- హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు, అధికారుల ముమ్మర తనిఖీలు
- చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదున్నర కిలోల బంగారం పట్టివేత
- నిజాం కాలేజీ సమీపంలో ఏడు కిలోల బంగారం, 300 కిలోల వెండి సీజ్
నిజాం కాలేజీ సమీపంలో గేట్ నెంబర్ 1 వద్ద 7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడే 300 కిలోల వెండిని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఫిలింనగర్ పరిధిలోని నారాయణమ్మ కాలేజీ సమీపంలో ఓ కారులో ఎలాంటి రసీదు లేని రూ.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల్లోను పెద్ద మొత్తంలో నగదు, బంగారం, అక్రమ మద్యం వంటి వాటిని పట్టుకున్నారు.