లోకేశ్ పాదయాత్రకు, పవన్ వారాహి యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు: గంటా శ్రీనివాసరావు
- చంద్రబాబును పలు కేసుల్లో నిందితుడైన జగన్ అరెస్ట్ చేయించారన్న గంటా
- కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని వ్యాఖ్య
- లులూను ఏపీ నుంచి తరిమేస్తే.. తెలంగాణ స్వాగతం పలికిందన్న గంటా
విశాఖ నుంచి ప్రముఖ సంస్థ లులూను ఏపీ ప్రభుత్వం తరిమేసిందని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఇక్కడి నుంచి తరిమేస్తే... తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానం పలికిందని చెప్పారు. ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో విసిగిపోయిన లులూ సంస్థ... ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టబోమని స్పష్టం చేసిందని తెలిపారు. జగన్ తన రివర్స్ పాలనతో లులూను పంపించేసి, 5 వేల మంది యువతకు ఉపాధిని దూరం చేశారని విమర్శించారు.