స్పెయిన్ లో 40 మంది స్నేహితులకు వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ

Varun Tej Bachelor Party in Spain
  • లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ తేజ్
  • బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకుతున్న తరుణంలో స్నేహితులకు పార్టీ
  • నవంబర్ మొదటి వారంలో మ్యారేజ్ ఉండొచ్చని సమాచారం
హీరోయిన్ లావణ్య త్రిపాఠిని మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. వీరు డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని... ఇటలీలో మ్యారేజ్ జరగబోతోందని సమాచారం. మరోవైపు బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకుతున్న నేపథ్యంలో, తన స్నేహితులకు వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు. స్పెయిన్ లో తన స్నేహితులతో కలిపి పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పార్టీకి 40 మంది స్నేహితులు హాజరయినట్టు సమాచారం. మరోవైపు వీరి మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో పెళ్లి ఉంటుందని చెపుతున్నారు.
Advertisement
Varun Tej
Tollywood
Bachelor Party
Spain

More Telugu News