శంషాబాద్‌లో దిగిన బ్రిటన్ సైనిక విమానాలు
- నిన్న ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన 4 టైఫూన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు
- ఎయిర్‌బస్ 330 విమానం కూడా
- హర్షం వ్యక్తం చేసిన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
బ్రిటన్ రక్షణ అవసరాలకు ఉపయోగపడుతున్న టైఫూన్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్‌బస్‌లకు గాలిలో ఉండగానే ఒక విమానం నుంచి మరో దాంట్లోకి ఇంధనాన్ని నింపుకొనే సామర్థ్యం ఉంటుంది. ఇలాంటి విమానాలు తమ ఎయిర్‌పోర్టుకు రావడంపై శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హర్షం వ్యక్తం చేసింది. ఇలాంటి విమానాలకు సులభంగా నిర్వహించే సామర్థ్యం, సంసిద్ధత తమ సొంతం అని తెలిపింది. పగటి పూటే వచ్చి రాత్రి వరకూ విమానాశ్రయం రన్‌వేపై ఉన్న ఈ విమానాల ఫొటోలను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసింది.