నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ప్రారంభం

నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ప్రారంభం

Arguments started in AP High Court on Nara Lokesh anticipatory bail petition in inner ring road case
  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్
  • ఏ క్షణంలోనైనా లోకేశ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం
  • హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసిన లోకేశ్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ ను సీఐడీ ఏ14గా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో లోకేశ్ ను సీఐడీ అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం ఈ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన అన్ని పిటిషన్లపై అన్ని కోర్టుల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, నారా లోకేశ్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా? లేక తిరస్కరిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది.
Advertisement
Nara Lokesh
Telugudesam
Inner Ring Road Case
AP High Court
Bail

More Telugu News