'చంద్రముఖి 2' అంతకుమించి ఉంటుంది: డైరెక్టర్ పి.వాసు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'చంద్రముఖి 2' అంతకుమించి ఉంటుంది: డైరెక్టర్ పి.వాసు

Chandramukhi 2 team interview
  • ఈ నెల 28వ తేదీన రానున్న 'చంద్రముఖి 2'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్ 
  • ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ లా ఉంటుందన్న డైరెక్టర్ 
  • వేట్టై రాజా పాత్ర వెనుక కూడా సస్పెన్స్ ఉంటుందని వెల్లడి
ఇప్పుడు అందరి దృష్టి 'చంద్రముఖి 2' సినిమాపైనే ఉంది. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో టీమ్ బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు వాసు .. హీరో లారెన్స్ .. హీరోయిన్ కంగనా పాల్గొన్నారు.

వాసు మాట్లాడుతూ ... 'చంద్రముఖి' సినిమాలో వేట్టై రాజాగా రజనీకాంత్ గారు కనిపించారు. అదే పేరుతో ఈ సినిమాలో లారెన్స్ కనిపిస్తారు. అయితే ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యం ఏమిటనేది సినిమా చూసిన తరువాతనే అర్థమవుతుంది. 'చంద్రముఖి' సినిమాలో క్లైమాక్స్ ఎలా ఉంటుందో, ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ నే ఆ రేంజ్ లో ఉంటుంది .. అందరికీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి" అని అన్నారు. 

'చంద్రముఖి' సినిమాలో ఆమె ఎవరిని ఆవహిస్తుంది అనే విషయంలో ఆడియన్స్ లో ఉత్కంఠను పెంచడం జరిగింది. ఈ సినిమాలో అంతకు ఏ మాత్రం తగ్గని సస్పెన్స్ ఉంటుంది. 'చంద్రముఖి 2' కంగనా అని తెలిసినా కథ నెక్స్ట్ లెవెల్లోనే వెళుతుంది. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిలో ఒక కథ రన్ అవుతూ ఉంటుంది. ఫస్టు ఆఫ్ ను మించి సెకండాఫ్ ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చారు.  
Advertisement
Chandramukhi 2
Kangana Ranaut
Lawrence
Vasu

More Telugu News