జనం రోడ్డెక్కితే జగన్ జడుసుకుంటున్నాడు: నారా లోకేశ్
- నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కిపడుతున్నాడన్న లోకేశ్
- ప్రశ్నించే గళాలను చూసి ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్య
- రాష్ట్రంలో దమనకాండ కొనసాగుతోందంటూ లోకేశ్ ట్వీట్
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వివిధ వర్గాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్ పిరికితనానికి అద్దం పడుతోందని నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో నిరసనలకు దిగిన మహిళలు, నేతలపై పోలీసుల దమనకాండను ప్రజలంతా గమనిస్తున్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక గళాలు ఉంటాయనే విషయం తెలుసుకోవాలంటూ జగన్ కు హితవు పలికారు.
