రవితేజ జోడీ కడుతున్న కన్నడ బ్యూటీ రష్మిక!
Advertisement

రవితేజ జోడీ కడుతున్న కన్నడ బ్యూటీ రష్మిక!

Rashmika in Raviteja Movie
  • తెలుగులో 'పుష్ప'తో హిట్ కొట్టిన రష్మిక 
  • హిందీలో గుర్తింపు తెచ్చిపెట్టిన 'మిషన్ మజ్ను'
  • తమిళంలో సంతృప్తినిచ్చిన 'వరిసు'
  • రవితేజ - గోపీచంద్ మలినేని సినిమాకి గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్ లో టాప్ త్రీ పొజిషన్స్ లో రష్మిక పేరు కూడా కనిపిస్తుంది. వరుస హిట్లతో రష్మిక చాలా వేగంగా తన జోరును చూపిస్తూ వచ్చింది. అయితే 'పుష్ప' తరువాత తెలుగులో ఆమెకి మరో హిట్ పడలేదు. 'సీతారామం' హిట్ పడింది గానీ .. అందులో ఆమె హీరోయిన్ కాదు. ఆ సినిమా క్రెడిట్ మృణాళ్ ఠాకూర్ ఖాతాలోకి వెళ్లిపోయింది.

ఆ తరువాత బాలీవుడ్ లో చేసిన 'మిషన్ మజ్ను' ..  కోలీవుడ్ లో చేసిన 'వరిసు' ఆమె గ్రాఫ్ ను నిలకడగా ఉంచుతూ వెళ్లాయి. ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాకి సంబంధించిన పనులతో ఆమె బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె తెలుగులో మరో ప్రాజెక్టును ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా రవితేజ సరసన కావడం విశేషం. 

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'డాన్ శీను' .. 'బలుపు' .. 'క్రాక్' వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. హ్యాట్రిక్ హిట్ తరువాత ఈ ఇద్దరూ కలిసి మరోసారి సెట్స్ పైకి వెళుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను ఖరారు చేసినట్టుగా చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. 
Advertisement
Raviteja
Rashmika Mandanna
Gopichand Malineni

More Telugu News