అంబటి రాంబాబుపై మీసం మెలేసి సవాల్ విసిరిన బాలకృష్ణ.. మీసాలు మెలేయడాలు సినిమాల్లో చేసుకోమన్న అంబటి!
- వాడీవేడిగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
- చంద్రబాబు అరెస్ట్ పై ఆందోళన చేపట్టిన టీడీపీ సభ్యులు
- బల్లలు కొట్టాల్సింది ఇక్కడ కాదు.. న్యాయస్థానాల్లో అన్న అంబటి
- దమ్ముంటే రా అంబటీ అంటూ సవాల్ విసిరిన బాలయ్య
దీంతో అంబటిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు. అంబటిపై మీసం మెలేయడంతో పాటు... 'దమ్ముంటే రా అంబటీ' అంటూ సవాల్ విసిరారు. దీనిపై అంబటి స్పందిస్తూ... మీసాలు మెలేయడాలు సినిమాల్లో చేసుకోవాలని సెటైర్ వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో, సభను స్పీకర్ తమ్మినేని 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.