Tollywood: ‘సలార్’ కోసం శ్రుతి హాసన్ సాహసం

Shruti Haasan dubbing in all five languages in Salaar
షార్ట్స్‌లో చూడండి
కమల హాసన్ కూతురుగా తెరంగేట్రం చేసిన హీరోయిన్ శ్రుతి హాసన్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ గా తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో బిజీగా ఉన్న శ్రుతి టాలీవుడ్ లో ఈ మధ్య వాల్తేరు వీరయ్య , వీరసింహరెడ్డి చిత్రాలతో అలరించింది. ఆమె ప్రభాస్ సరసన నటించిన ప్యాన్ ఇండియా చిత్రం 'సలార్' విడుదలకు సిద్ధంగా ఉంది. కేజీఎఫ్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో ఈ చిత్రం సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

 ఈ సినిమా నుంచి శ్రుతికి సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. ఇందులో తన పాత్రకు శ్రుతినే డబ్బింగ్ చెబుతోంది. ఇందులో కొత్తేమిటంటారా? ఉంది. ఐదు భాషల్లో వస్తున్న ఈ చిత్రంలో అన్నింటికి శ్రుతి డబ్బింగ్ చెబుతోంది. ఇప్పటికే మూడు భాషల డబ్బింగ్ పనులు పూర్తి చేసింది. మరో రెండింటివి కూడా పూర్తి చేసే పనిలో ఉంది. సాధారణంగా ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పుకునేందుకు హీరోయిన్లు వెనుకాడుతారు. కానీ, శ్రుతి ఏకంగా ఐదు భాషల్లో సొంత గొంతు వినిపించే సాహసం చేయనుంది.
Go Back to Shorts
Tollywood
Bollywood
Shruti Haasan
salaar
Prabhas

More Telugu News