చంద్రయాన్-3: ఇస్రో బృందంలో నగరి మహిళా శాస్త్రవేత్త, రోజా ట్వీట్
- ఇస్రోకు మరోసారి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రోజా
- అపురూపమైన కలను సాకారం చేసిన శాస్త్రవేత్తల బృందానికి రోజా అభినందనలు
- ఇస్రో బృందంలో నగరికి చెందిన మహిళా శాస్త్రవేత్త
- ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ రోజా ట్వీట్
ఇస్రోకు శుభాకాంక్షలు... ఈ ప్రయోగం భారత్‌కు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. అపురూపమైన కలను సాకారం చేసిన శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్ నగరి రూరల్ మండలం తడుకుపేటకు చెందిన అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన కాళహస్తి గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.