ఒకే వేదికపైకి చిరంజీవి, బాలకృష్ణ?.. మోగా, నందమూరి ఫ్యాన్స్ కు పండగే!
- అత్యంత ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న బాలయ్య 'అన్ స్టాపబుల్'
- ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన బాలయ్య
- బాలయ్య షోకు చిరంజీవి హాజరవుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం
తాజాగా ఈ షోకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ షోకు హాజరవుతున్నారనేదే ఆ వార్త. టాలీవుడ్ లో అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ ఒకే వేదికపై కనిపిస్తే ఇక ప్రేక్షకులకు పండగే అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒకవేళ చిరంజీవి ఈ షోకు హాజరైతే... ఆయనకు బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? ఎలాంటి సరికొత్త విషయాలను ఆయనతో చెప్పిస్తారు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.