నేడు, రేపు తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు

నేడు, రేపు తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు

Heavy rains in Telangana for two days
  • శుక్ర, శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు
  • బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం
  • రెండు రోజుల పాటు ఎల్లో హెచ్చరికల జారీ 
తెలంగాణలో శుక్ర, శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలలో కొనసాగుతున్నట్లు తెలిపింది. అల్పపీడనం పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ రాగల రెండు నుండి మూడు రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర చత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు దిగువస్థాయిలోని గాలులు, పశ్చిమ, వాయవ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నట్లు తెలిపింది.

ఈ రోజు ఆదిలాబాద్, కొమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెంలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపు ఆదిలాబాద్, కుమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది. ఈ రెండు రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
Advertisement
Hyderabad
Telangana
rain

More Telugu News