యాభై ఏళ్ల పెద్దావిడకు రాహుల్ ఫ్లైయింగ్ కిస్ ఎందుకిస్తారు..?: బీహార్ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే
- ఆయన ఇవ్వాలనుకుంటే యువతులకే ఇస్తారన్న నీతూ సింగ్
- రాహుల్ ఒప్పుకుంటే పెళ్లికి చాలామంది యువతులు రెడీగా ఉన్నారని వెల్లడి
- నిరాధార ఆరోపణలతో తమ లీడర్ పై బురదజల్లుతున్నారని మండిపాటు
ఈమేరకు ఎమ్మెల్యే నీతూ సింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ లీడర్ పై బీజేపీ కావాలనే, నిరాధార ఆరోపణలతో బురదజల్లుతోందని నీతూ సింగ్ ఈ వీడియోలో మండిపడ్డారు. కాగా, నీతూ సింగ్ వీడియోపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ట్విట్టర్లో స్పందిస్తూ.. నీతూ సింగ్ వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతూసింగ్ తీరు అవమానకరంగా ఉందని విమర్శించారు. భాటియాతో పాటు బీజేపీ మరో అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళల వ్యతిరేకి అని, రాహుల్ గాంధీని కాపాడుకోవడానికి ఆ పార్టీ నేతలు ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు.